రామ్ చరణ్ ‘బీస్ట్ మోడ్ ఆన్’.!
- September 17, 2024
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పుడూ కండలు తిరిగిన దేహంతో సిక్స్ ప్యాక్ బాడీతోనే వుంటారు. కథ డిమాండ్ చేస్తే.. ‘వినయ విధేయ రామ’ సినిమా తరహాలో ఇంకాస్త ఎక్కువగా కండలు పెంచేస్తుంటారు.
అలాంటి డిమాండే ఇప్పుడు కూడా వచ్చినట్లుంది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ కండలు తిరిగిన దేహంతో కనిపించబోతున్నాడట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు.
‘బీస్ట్ మోడ్ ఆన్’ అంటూ ఓ ఫోటో పోస్ట్ చేసి ఈ విషయాన్ని కన్‌ఫామ్ చేశారాయన. ఓ వైపు ఆయన నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా రిలీజ్ కాకుండానే, ఈ సినిమాని పట్టాలెక్కించేశారు రామ్ చరణ్.
డిశంబర్‌లో ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ లోపు ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయిపోనుందేమో. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుంది. విలేజ్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా కథ, కథనాలుండబోతున్నాయని ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







