కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అడ్డంగా బుక్కయిపోయినట్లేనా.?

- September 17, 2024 , by Maagulf
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అడ్డంగా బుక్కయిపోయినట్లేనా.?

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రఫర్‌గా పని చేస్తున్న ఓ అమ్మాయిని లైంగికంగా వేధించినందుకు గాను పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

ఈ విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవు‌డ్‌లో ప్రముఖ హీరోలు రామ్ చరణ్, ఎన్టీయార్, అల్లు అర్జున్.. ఇలా పలువురికి డాన్స్ కొరియెగ్రఫీ చేస్తూ టాప్ కొరియెగ్రఫర్లలో ఒకరుగా చెలామణీ అవుతున్నారాయన.

ఈ మధ్యనే తమిళ, హిందీ సినిమాల్లోనూ కొరియెగ్రాఫర్‌గా సత్తా చాటుతున్నారు. అంతేకాదు, రాజకీయంగానూ జనసేన పార్టీ తరపున యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారు. రీసెంట్‌గా జరిగిన ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్ ప్రచారాల్లో కీలక పాత్ర పోషించారాయన.

అలాంటిది లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కోవడం ఆశ్చర్యకరం, బాధాకరం. తాజా కేసు కారణంగా జనసేన పార్టీ కార్యకలాపాలకు దూరంగా వుండాలంటూ పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.

అప్పుడెప్పుడో 2017లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసిన ఆమె, ఓ సినిమాకి కొరియెగ్రఫీ చేసే నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటూ మరో ఇద్దరితో కలిసి ముంబయ్ వెళ్లిందనీ, ఆ క్రమంలోనే జానీ మాస్టర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారనీ, అంతేకాక మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశారంటూ, సదరు, బాధితురాలు అని చెప్పబడుతున్న ఆమె ఆరోపించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిజంగానే జానీ మాస్టర్ తప్పు చేశాడా.? ఇంత రచ్చ జరుగుతుంటే, కనీసం స్పందించడం లేదెందుకు.? ఇలాంటి అనేక రకాల అనుమానాలు. వీటన్నింటికీ చెక్ పడాలంటే, జానీ మాస్టర్ రెస్పాండ్ అవ్వాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com