మెంతులు జుట్టుకు చేసే మేలు తెలుసా.?
- September 17, 2024
మెంతులు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా డయాబెటిస్ రోగుల పాలిట మెంతులు వరంగానే చెబుతుంటారు. మెంతుల పొడిని ప్రతీరోజూ పరగడుపున వాటర్‌లో కలిపి తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో వుంటుందని నిపుణులు చెబుతారు.
అయితే, మెంతులు కేవలం డయాబెటిస్ వున్న వాళ్లకే కాదండోయ్. అందరూ తీసుకోవచ్చు ఆరోగ్యం పరంగా. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మెంతుల టిప్ కేవలం జుట్టు కోసమే.
ప్రస్తుత పరిస్థితుల్లో తెల్ల జుట్టు సమస్యతో పాటూ, జుట్టు రాలడం ప్రధాన సమస్యగా మారింది. తెల్ల జుట్టు ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీస్తోంది. దాంతో, ఆ సమస్యను తప్పించుకోవడానికి టెంపరరీగా మార్కెట్లో లభించే హెయిర్ డైలను వాడి సైడ్ ఎఫెక్టుల బారిన పడుతున్నారు.
అయితే, మెంతులతో మనం చెప్పుకోబోయే టిప్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. అలాగే హెయిర్‌కి మంచి న్యూట్రిషన్లను కూడా అందిస్తుంది. మాయిశ్చరైజర్‌లా పని చేస్తుంది.
తద్వారా ఆరోగ్యవంతమైన నల్లని జుట్టును సొంతం చేసుకోవచ్చు. అందుకు కావల్సినవి కొద్దిగా మెంతులు, అలాగే కలోంజీ సీడ్స్ (మార్కెట్లో లభిస్తాయ్), కొబ్బరి నూనె.
ఓ పాత్రలో కావల్సిన కంటెంట్‌లో కొబ్బరి నూనె తీసుకుని వేడి చేయాలి. నూనె మరుగుతున్న టైమ్‌లోనే మెంతులు, కలోంజీ సీడ్స్ ఈక్వెల్ రేషియోలో తీసుకుని వేడి చేయాలి. కొబ్బరి నూనె కలర్ మారేంత వరకూ ఇలా చేయాలి.
తర్వాత నూనెను చల్లార్చి దాన్ని తలకు పట్టించాలి. అరగంట సేపటి తర్వాత తలస్నానం చేసేస్తే సరిపోతుంది. లేదంటే రాత్రిపూట ఈ నూనె తలకు పట్టించి తెల్లవారి తల స్నానం చేసినా సరిపోతుంది. వారానికి రెండు సార్లు ఇలా చేసినా తెల్ల జుట్టు సమస్యతో పాటూ జుట్టు రాలే సమస్య కూడా తీరిపోతుంది. ఆల్రెడీ వున్న తెల్ల జుట్టు నల్లగా మారడంతో పాటూ, కొత్తగా తెల్ల జుట్టు కూడా రాకుండా వుంటుంది. ట్రై చేసి చూడండి.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!