టాలీవుడ్‌లో చెల్లెలికి కూడా రంగం సిద్ధం చేస్తున్న జాన్వీ కపూర్.?
- September 17, 2024
అతిలోక సుందరిగా సౌత్, నార్త్‌లో పేరున్న నటి దివంగత శ్రీదేవి. హీరోయిన్లలో ఆమెకు సాటి ఆమెనే అంటే అతిశయోక్తి కాదనే చెప్పొచ్చు. కానీ, ఆమె ముద్దుల తనయల విషయంలో అలా జరగడం లేదు.
తల్లి లెగసీని నిలబెట్టడంలో కూతుళ్లు వెనకబడే వుండిపోయారు రేస్‌లో. జాన్వీ కపూర్ ఒకింత బెటరే అనొచ్చు. కానీ, శ్రీదేవిలా కమర్షియల్ హీరోయిన్ ట్యాగ్ అయితే జాన్వీ కపూర్ అందుకోలేకపోయింది.
విలక్షణ నటిగానే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో బాలీవుడ్‌లో సత్తా చాటిందింతవరకూ. ఇప్పుడే టాలీవుడ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఎన్టీయార్‌తో ‘దేవర’ సినిమాలో నటిస్తోంది. రెండో సినిమాగా రామ్ చరణ్ సరసన నటిస్తోంది.
ఇక జాన్వీ సంగతిలా వుంటే, ఆమె సోదరి, శ్రీదేవి రెండో తనయ ఖుషీ కపూర్ కూడా టాలీవుడ్‌లో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోందనీ తాజా సమాచారం. ప్రస్తుతం జునైత్ ఖాన్ హీరోగా బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తోంది ఖుషీ కపూర్.
అన్నీ కలిసొస్తే, త్వరలోనే టాలీవుడ్‌లో ఓ యంగ్ హీరో సినిమాతో తెరంగేట్రం చేయబోతోందనీ ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







