హైదరాబాద్‌లో నిమజ్జనంపై పూర్తి వివరాలు తెలిపిన సీపీ సీవీ ఆనంద్
- September 18, 2024
హైదరాబాద్: హైదరాబాద్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై నగర సీపీ సీవీ ఆనంద్ వివరాలు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే మూడు గంటల ముందే నిమజ్జన ప్రక్రియ పూర్తి అయిందని, ఉదయం 10.30 గంటలకే అన్ని ట్రాఫిక్ జంక్షన్లు క్లియర్ అయ్యాయని తెలిపారు.
ఒక ప్రణాళిక ప్రకారం నిమజ్జన ప్రక్రియ పూర్తి చేశామని, సాధారణ ప్రజలకు రూట్ క్లియర్ చేశామని అన్నారు. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం అనుకున్న సమయానికి పూర్తి అయిందని అన్నారు. ఈ నిమజ్జన ప్రక్రియలో పాల్గొన్న ప్రతి పోలీసుకి ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. రాత్రి 10.30 గంటలకు ఓల్డ్ సిటీలో వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తి అయిందని అన్నారు.
ఇవాళ వర్కింగ్ డే కాబట్టి, విగ్రహాలను తీసుకెళ్లేవారు ప్రజలకి సహకరించాలని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. కొన్ని వాహనాల బ్రేక్ డౌన్ వళ్ల నిమజ్జనం కొంత ఆలస్యం అయిందని చెప్పారు. లేదంటే ఉదయం 7 గంటలకే నిమజ్జన ప్రక్రియ పూర్తి అయ్యేదని వివరించారు. నిమజ్జనానికి సహకరించిన ప్రతి ఒక్కరిని చేతులు ఎత్తి నమస్కరిస్తున్నానని వ్యాఖ్యానించారు. మొత్తం 11 రోజుల్లో కేవలం హుస్సేన్ సాగర్‌లోనే లక్ష విగ్రహాల నిమజ్జనం పూర్తి అయిందని తెలిపారు.
తాజా వార్తలు
- దోపిడీ, మనీలాండరింగ్ కేసులో 80 మంది ముఠాకు జైలు శిక్ష..!!
- వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!
- రమదాన్..ఎనిమిదవ మక్కా లాంతర్ల ఉత్సవం ప్రారంభం..!!
- యూఏఈ ఎతిహాద్-శాట్ ప్రయోగం విజయవంతం..!!
- మాదకద్రవ్యాల వినియోగం..మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- అమెరికాలో గ్రీన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్..
- హెచ్ఐవీకి చెక్ పెట్టేలా కొత్త మందు..
- షఖురాలో హత్య.. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించిన బాధిత ఫ్యామిలీ..!!
- 2025-26 అకాడమిక్ ఇయర్.. విద్యార్థుల నమోదుకు సర్క్యులర్ జారీ..!!