ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదుల దారుణం
- July 05, 2015
ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు తమ దారుణాలు చూపించే మరో వీడియోను విడుదల చేశారు. 25 మంది వరకు ప్రభుత్వ ఫోర్సెస్‌ను నిర్దాక్షిణ్యింగా చంపేశారు. సెంట్రల్ సిరియాలోని ప్రాచీన నగరం పాల్మిరాలో ఈ సంఘటన జరిగింది. పాల్మీరాలోని మిలిన్నా ఓల్డ్ ఓయాసిస్లో గల ప్రాచీన రోమన్ థియేటర్లో వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ శనివారం చెప్పింది. ప్రస్తుతం ఆ థియేటర్ ఐసిస్ మిలిటెంట్ చేతుల్లో ఉంది. మే నెల నుండి అది వారి చేతుల్లోనే ఉంది. వీడియోలో... సైనికులను మోకాళ్ల పైన కూర్చుండబెట్టారు. వారి ముఖాలకు మాస్కులు వేశారు. వారి పక్కన ఐసిస్ ఉగ్రవాదులు నిలుచున్నారు. వారి తలలకు తుపాకులు పెట్టారు. ఈ హత్యాకాండ మే 27వ తేదీన జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







