ప్రశాంత్ నీల్ - ఎన్టీయార్ మొదలెట్టేస్తారట. కానీ.!

- September 21, 2024 , by Maagulf
ప్రశాంత్ నీల్ - ఎన్టీయార్ మొదలెట్టేస్తారట. కానీ.!

‘సలార్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీయార్ ఓ సినిమా చేయాల్సి వుంది. ‘దేవర’ తర్వాత ఈ సినిమా షూటింగ్‌లో ఎన్టీయార్ పాల్గొనాల్సి వుంది. కానీ, ఈ సినిమాని అక్టోబర్ నుంచి స్టార్ట్ చేయనున్నారట.

తొలి షెడ్యూల్‌గా 40 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారట. అయితే, ఈ షెడ్యూల్ షూటింగ్ మొత్తం ఎన్టీయార్ లేకుండానే జరగనుందట.

ఎన్టీయార్ మినహా ఇతర నటీనటులతో ఈ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసేయనున్నారట. తదుపరి జరిగే షెడ్యూల్‌లో ఎన్టీయార్ పాల్గొనబోతున్నారనీ తెలుస్తోంది.

ఈ సినిమా పూర్తి కాగానే ఎన్టీయార్ ‘దేవర 2’ పూర్తి చేయాల్సి వుంది. ‘దేవర’ మొదటి పార్ట్ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ రిజల్ట్‌ని బట్టి వెంటనే రెండో పార్ట్ ఆలోచన చేస్తారా.? లేదంటే టైమ్ తీసుకుంటారా.? అనేది తెలుస్తుంది.

‘దేవర’ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా అయితే పక్కా అని తాజాగా అందుతోన్న సమాచారం. ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com