శర్వా కొత్త ప్రాజెక్ట్.! ఈ సారి ప్యాన్ ఇండియా టార్గెట్.!

- September 21, 2024 , by Maagulf
శర్వా కొత్త ప్రాజెక్ట్.! ఈ సారి ప్యాన్ ఇండియా టార్గెట్.!

సంపత్ నంది డైరెక్షన్‌లో శర్వానంద్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని కె.కె.రాధా మోహన్ నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమాకి సంబంధించిన లైనప్ సంపత్ నంది ముందే వెల్లడించేశారు.

1960 బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా కథ వుండబోతోందనీ తెలుస్తోంది. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సంపత్ నంది ఈ సినిమాని పీరియాడిక్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు.

యూనిక్ సబ్జెక్ట్‌ కావడంతో ఈ సినిమాని ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాలనుకుంటున్నారట. శర్వా 38వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమా శర్వా కెరీర్‌లోనే తొలి ప్యాన్ ఇండియా మూవీగా పరిగణించొచ్చు.

ఇటీవలే ‘మనమే’ సినిమాతో ఫెయిల్యూర్ చవి చూసిన శర్వా ఈ సినిమా కోసం రెట్రో లుక్స్‌తో మేకోవర్ కానున్నాడట.  హీరోయిన్ తదితర వివరాలు తెలియాల్సి వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com