దుబాయ్ లో 3,800 ఈ-స్కూటర్లు, బైక్‌లు స్వాధీనం..!!

- September 22, 2024 , by Maagulf
దుబాయ్ లో 3,800 ఈ-స్కూటర్లు, బైక్‌లు స్వాధీనం..!!

దుబాయ్: భద్రతా ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసులు దాదాపు 3,800 ఈ-స్కూటర్లు, బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పబ్లిక్ రోడ్లలో ఉపయోగించడంతో సహా వివిధ ఉల్లంఘనల నేపథ్యంలో సుమారు 3,800 ఇ-స్కూటర్లు, సైకిళ్లు, ఇ-బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి 2,286 సైకిళ్లు, 771 ఈ-బైక్‌లు, 722 స్కూటర్లు సహా మొత్తం 3,779 స్వాధీనం చేసుకున్నట్లు నైఫ్ పోలీస్ స్టేషన్ తాత్కాలిక డైరెక్టర్ బ్రిగ్ ఒమర్ ముసా అషూర్ వెల్లడించారు.
స్కూటర్లు, ఎలక్ట్రిక్ లేదా సాధారణ సైకిళ్లను నడుపుతున్నప్పుడు  భద్రతా నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించారు. అనుమతి లేని లేన్‌లలో నడపడం, జాగింగ్ లేదా వాకింగ్ లేన్‌లను ఉపయోగించడం, ఎలక్ట్రిక్ స్కూటర్‌లపై భారీ వస్తువులను తీసుకెళ్లడం చేయవద్దని సూచించారు. ట్రాఫిక్ నియమాలు, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. దుబాయ్ పోలీస్ స్మార్ట్‌ఫోన్ యాప్‌లో అందుబాటులో ఉన్న "పోలీస్ ఐ" సేవ ద్వారా లేదా 901లో "వి ఆర్ ఆల్ పోలీస్" సేవకు కాల్ చేయడం ద్వారా ప్రతికూల ప్రవర్తనలు లేదా ప్రమాదకరమైన చర్యలను నివేదించాలని  ప్రజలకు పిలుపునిచ్చారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com