ఆర్జీవీ ‘శారీ’ సినిమా ఫస్ట్ సాంగ్ విడుదల
- September 22, 2024
హైదరాబాద్: ఆర్జీవీ గతంలో చీరలతో ఫోటోషూట్స్ చేసే ఓ మలయాళీ అమ్మాయిని వైరల్ చేసి ఆ అమ్మాయితో శారీ అనే సినిమా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ అమ్మాయి శ్రీలక్ష్మి సతీష్(అలియాస్ ఆరాధ్య దేవి)తో శారీ సినిమా తీసి ఇటీవల టీజర్ కూడా రిలీజ్ చేసాడు ఆర్జీవీ. టీజర్లో.. రెగ్యులర్ గా చీరల్లో తిరిగే ఓ అందమైన అమ్మాయిని పిచ్చిగా ప్రేమించిన అబ్బాయి ఆ ప్రేమ ఎక్కువై సైకోగా ఎలా మారాడు అన్నట్టు కథ ఉండబోతుందని చూపించారు.
తాజాగా శారీ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేసారు. ఐ వాంట్ లవ్ ఫర్ ఎవర్ అంటూ సాగే ఈ సాంగ్ లో ఆరాధ్య దేవిని మరింత అందంగా చూపిస్తూ ఈ సాంగ్ షాట్ చేసారు. అడవుల్లో, జలపాతం వద్ద ఈ సాంగ్ షూట్ చేసారు. ఈ పాటని సిరాశ్రీ రాయగా DSR బాలాజీ సంగీత దర్శకత్వంలో కీర్తన శేష్ పాడింది. ప్రస్తుతం ఈ హాట్ సాంగ్ వైరల్ గా మారింది. మీరు కూడా ఆర్జీవీ శారీ సాంగ్ వినేయండి..
ఇక ఈ శారీ సినిమాని రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో గిరి కృష్ణ కమల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తుండగా ఆరాధ్య దేవి, సత్య యదు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సాంగ్ తో ఆర్జీవీ డెన్ అనే కొత్త మ్యూజిక్ ఛానల్ ని కూడా మొదలుపెట్టాడు ఆర్జీవీ. ఇకపై తన సినిమాల సాంగ్స్ అన్ని ఈ మ్యూజిక్ ఛానల్ లోనే విడుదల అవ్వొచ్చు.
తాజా వార్తలు
- అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్‌లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం







