1,661 కిలోల సముద్ర జీవులను స్వాధీనం చేసుకున్న కోస్ట్ గార్డ్..!!
- September 22, 2024
మనామా: 2024 జనవరి 1 నుండి జూలై 31 వరకు ఏడు నెలల వ్యవధిలో 1,661 కిలోగ్రాములముద్ర జీవులను స్వాధీనం చేసుకున్నట్లు కోస్ట్ గార్డ్ ప్రకటించింది. అక్రమంగా పట్టుకున్న వాటిల్లో చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర జాతులు ఉన్నాయని తెలిపింది. అక్రమ చేపలు పట్టడం, లైసెన్స్ లేని వాటి వినియోగంతో సహా 820 సముద్ర ఉల్లంఘనలను అధికారులు నమోదు చేశారని వెల్లడించారు. ఇదే సమయంలో కోస్ట్ గార్డ్ పెట్రోలింగ్ టీమ్స్ 472 మంది వ్యక్తులను రక్షించిందని, 318 నౌకలకు సహాయం చేసిందని వెల్లడించారు. మత్స్యకారులు, మత్స్యకారులు నిబంధనలు పాటించి తనిఖీలకు సహకరించాలని కోరారు. ఉల్లంఘించిన వారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష తోపాటు BHD 2,000 వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన







