జింబాబ్వే ను వోడించిన భారత్
- June 20, 2016
జింబాబ్వేతో తొలి టీ20లో ఓటమి చవిచూసిన భారత్ రెండో టీ20లో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టును 99 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్లే మ్యాచ్ను గెలిపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి జింబాబ్వే 99 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 13.1 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 103 పరుగులు చేసి విజయం సాధించింది. భారత బ్యాట్స్మెన్స్ రాహుల్ 47, మన్దీప్ సింగ్ 52 పరుగులు చేశారు. శరణ్ 4, బుమ్రా 3, కులకర్ణి, చాహల్ చెరొక వికెట్ తీసుకున్నారు. 31 పరుగులు చేసిన మూర్.. జింబాబ్వే తరఫున హైయెస్ట్ స్కోరర్.
శరణ్ 4 ఓవర్లలో కేవలం పది పరుగులే ఇవ్వగా.. బుమ్రా 11 పరుగులే ఇచ్చాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







