సౌదీ లో 19% పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- September 26, 2024
రియాద్: సౌదీ అరేబియాలో చమురుయేతర ఎగుమతులు జూలైలో 19 శాతం పెరిగి SR25.4 బిలియన్లకు చేరాయి. 2023 ఇదే నెలలో SR21.3 బిలియన్లుగా ఉంది. జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) విడుదల చేసిన జూలై నెలకు సంబంధించి అంతర్జాతీయ వాణిజ్యం స్టాటిస్టికల్ బులెటిన్‌లో ఈ మేరకు వెల్లడించారు. చమురు ఎగుమతులు 3.1 శాతం తగ్గినప్పటికీ, జూలై 2023లో SR92.6 బిలియన్లతో పోలిస్తే కమోడిటీ ఎగుమతులు రెండు శాతం పెరిగి SR94.5 బిలియన్లకు చేరుకున్నాయి. గత జూలైలో SR69.1 బిలియన్లతో పోలిస్తే ఇది SR71.3 బిలియన్లకు చేరుకున్నాయి. మొత్తం ఎగుమతులకు చమురు ఎగుమతులు జూలైలో 73.1 శాతానికి(2023లో 77 శాతం) తగ్గింది. జూలైలో దిగుమతులు 12.6 శాతం పెరిగి SR75.2 బిలియన్లకు చేరుకున్నాయని తెలిపారు. రసాయనాలు, ప్లాస్టిక్లు, రబ్బరు ఉత్పత్తులు చమురుయేతర ఎగుమతులలో అత్యధిక వాటాను కలిగి ఉన్నాయి. యంత్రాలు, ఎలక్ట్రికల్ ఉపకరణాలు, పరికరాలు దిగుమతుల్లో అత్యధిక వాటాను కలిగి ఉన్నాయని గణాంకాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో సందడిగా న్యూ ఇండియన్ స్కూల్ వార్షికోత్సవం..!!
- ఖతార్‌లో ఈ టాబ్లెట్ రీకాల్..!!
- నేపాల్ కు రూ.15 వేల కోట్ల సాయం–ప్రధాని మోదీ
- సౌదీ అరేబియాలో పెరిగిన నిర్మాణ వ్యయాలు..!!
- హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు.. కాచిగూడ రైల్వే స్టేషన్ టార్గెట్‌గా మెయిల్
- కువైట్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’.. చిన్నారుల సందడి..!!
- ఒమన్‌లో సబ్సిడీ కార్డుల ద్వారా డీజిల్ విక్రయాలు..!!
- అవయవ మార్పిడి చికిత్సల్లో కింగ్ ఫైసల్ హాస్పిటల్ అరుదైన ఘనత..!!
- ఖతార్‌లో రెండో దశ ఎలక్ట్రిక్ రోబోటాక్సీల ట్రయల్స్..!!
- యూఎన్ ఆరోపణలను ఖండించిన బహ్రెయిన్..!!







