బ్లడ్ బ్యాంకును ప్రారంభించిన నారా భువనేశ్వరి
- September 30, 2024
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు రాజమండ్రిలో బ్లడ్ బ్యాంకును ప్రారంభించారు. ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ బ్లడ్ బ్యాంకు నెలకొల్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో నారా భువనేశ్వరితో పాటు ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యకలాపాలను మరింత విస్తరిస్తుండడం ఆనందం కలిగిస్తోందని అన్నారు.
ఇప్పటిదాకా మూడు బ్లడ్ బ్యాంకులు స్థాపించామని, ఇవాళ రాజమండ్రిలో ప్రారంభించినది నాలుగో బ్లడ్ బ్యాంకు అని తెలిపారు. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలో బ్లడ్ బ్యాంకులు ఇప్పటికే నడుస్తున్నాయని నారా భువనేశ్వరి వివరించారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ సారథ్యంలోని బ్లడ్ బ్యాంకుల ద్వారా 8.1 లక్షల మంది నిరుపేదలకు, థలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా రక్తం అందించామని వెల్లడించారు. రక్తదానం చేసిన దాతలకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!
- అమెరికాలో మొదటి యుద్ధ నౌకను ఆవిష్కరించిన సౌదీ..!!
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం







