ఏపీలో ఈనెల 3 నుంచి దసరా సెలవులు!
- October 01, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఏపీలో దసరా సెలవులను ఫైనల్ చేస్తూ… కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల మూడవ తేదీ నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్లు.. వెల్లడించింది. ఈ నెల 3 నుంచి… అక్టోబర్ 14వ తేదీ వరకు.. ఏపీలోని విద్యాసంస్థలకు… దసరా హాలిడేస్ ఉండనున్నాయి. ఈ మేరకు అన్ని విద్యాసంస్థలకు… చంద్రబాబు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దసరా సెలవుల్లో ఎలాంటి ప్రత్యేక క్లాసులు నిర్వహించకూడదని కూడా పేర్కొంది. ఒకవేళ పదో తరగతి స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
కాగా, వాస్తవానికి రాష్ట్రంలో అక్టోబరు 4 నుంచి 13 వరకు సెలవులు ఇవ్వాలని ముందు నిర్ణయించారు. అయితే, తెలంగాణలో అక్టోబరు 3 నుంచే ఇస్తున్నారన్న విషయాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. వారి విజ్ఞప్తుల పట్ల సానుకూలంగా స్పందించిన లోకేశ్… అక్టోబరు 3 నుంచే దసరా సెలవుల ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. తద్వారా ఏపీలో విద్యార్థులకు 12 రోజులు సెలవులు లభించనున్నాయి. అక్టోబరు 2న గాంధీ జయంతి కాగా… ఆ రోజుతో కూడా కలుపుకుంటే అక్టోబరు 13 వరకు మొత్తం 12 రోజులు సెలవులు వస్తాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







