సొంత డబ్బింగ్ చెప్పుకోవడానికి రెడీ అవుతున్న మోహన్‌లాల్
- June 20, 2016
మలయాళ మెగాస్టార్‌గా ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మోహన్‌లాల్ ప్రస్తుతం రెండు తెలుగు ప్రాజెక్టులలో నటిస్తున్నాడు. అందులో ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ కాగా, మరొకటి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన మనమంతా. ఈ రెండు సినిమాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు మోహన్ లాల్. అయితే ఈ చిత్రాల కోసం మోహన్ లాల్ ఏకంగా తెలుగు నేర్చేసుకున్నాడు. కొన్నాళ్ళ నుండి తెలుగుపై పట్టు సాధించేందుకు చాలా కృషి చేసాడు మోహన్ లాల్. ప్రస్తుతం ఆయన తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక తను నటిస్తున్న రెండు తెలుగు సినిమాలలో తానే ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు మోహన్ లాల్.చంద్రశేఖర్ యేలేటి మూవీ మనమంతాకి డబ్బింగ్ మొదలు పెట్టేశాడు కూడా. వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేశాడు ఈ మలయాళ సూపర్ స్టార్. మోహన్ లాల్ చేస్తున్న కృషిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







