జెట్ ఎయిర్ వేస్ ఇన్నోవేటివ్ బుకింగ్
- June 20, 2016
ఇండియాకి చెందిన ప్రీమియర్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్, సరికొత్త బుకింగ్ ఫీచర్ ఫేర్ లాక్‌ని ప్రారంభించింది. జెట్ ఎయిర్ వేస్ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ల ద్వారా బుక్ చేసుకునే వినియోగదారుల కోసం ఈ ఫేర్ లాక్‌ని అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫేర్ లాక్‌లో సభ్యత్వం కోసం అంతర్జాతీయ ప్రయాణీకులు 4 ఒమన్ రియాల్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది టిక్కెట్ బుక్ చేసుకున్నప్పుడు అందులోంచి మినహాయించబడుతుంది. తమకు కావాల్సిన సమయంలో విమాన ప్రయాణం చేసుకోవడంతోపాటు, టిక్కెట్ ఫేర్‌ని కూడా లాక్ చేసుకోవడం ఈ ఫేర్ లాక్ స్పెషాలిటీ. మస్కట్ నుంచి కోచి, తిరువనంతపురం, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాలకు ఈ ఫేర్‌లాక్ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానంతో ఎయిర్ లైన్స్ రంగంలో జెట్ ఎయిర్ వేస్ కొత్త అధ్యాయానికి తెరలేపిందనీ, ఇది వినియోగదారులకు ఎంతో అందుబాటులో ఉంటుందని, ఈ పథకం విజయవంతమవుతుందని ఆశిస్తున్నామని జెట్ ఎయిర్ వేస్ ఒమన్ జనరల్ మేనేజర్ మన్ను ఆనంద్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







