నాగచైతన్య సమంత విడాకులకు కేటీఆరే ప్రధాన కారణం: మంత్రి కొండా సురేఖ

- October 02, 2024 , by Maagulf
నాగచైతన్య సమంత విడాకులకు కేటీఆరే ప్రధాన కారణం: మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నాగచైతన్య సమంత విడాకులకు మాజీ మంత్రి కేటీఆరే ప్రధాన కారణమని మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. బాపూఘాట్‌లో గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఈ వ్యాఖ్యలతో ఇప్పటి వరకు సినీ పరిశ్రమకే పరిమితమైన సమంత, నాగచైతన్య విడాకుల వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుని మరింత వేడెక్కింది. వారిద్దరూ విడాకులు తీసుకొని దాదాపు మూడేళ్లు గడుస్తోంది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో విడాకుల అంశం తెలంగాణాలో ఇపుడు హాట్ టాపిక్ అయ్యింది. 

ఇక రకుల్ ప్రీత్ సింగ్ కూడా త్వరగా పెళ్లి చేసుకోవడానికి కేటీఆర్ కారణమని ఆమె పేర్కొన్నారు. ఇంకా ఆమె కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఆయన సినీ హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని, ఫోన్లు ట్యాప్ చేసి, మత్తు పదార్థాలకు అలవాటు చేసి, రేవ్ పార్టీల్లో పాల్గొని, హీరోయిన్లను బ్లాక్‌మెయిల్ చేసి వారి జీవితాలను నాశనం చేశారని అన్నారు.

దుబాయ్ నుంచి మూడు అకౌంట్ల ద్వారా తనపై ట్రోలింగ్ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టమని కేటీఆర్ తన టీమ్‌కు చెప్పారని ఆరోపించారు. గతంలో గిరిజన మహిళా మంత్రి సీతక్క, మేయర్ విజయలక్ష్మి మీద కూడా అసభ్యంగా పోస్టులు పెట్టించారని విమర్శించారు. ఇప్పుడు బీసీ మహిళైన తనను కూడా కించపరుస్తూ పోస్టులుపెట్టడం బాధాకరమని వాపోయారు. తనపై పెట్టిన పోస్టులకు మాజీ మంత్రి హరీష్ రావు మానవతా థృక్పతంతో స్పందించారు. కేటీఆర్‌కు ఆ మాత్రం సోయి లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com