రాందేవ్ బాబా మరో మెగా ప్రాజెక్ట్‌...

- June 21, 2016 , by Maagulf
రాందేవ్ బాబా మరో మెగా ప్రాజెక్ట్‌...

యోగా గురు రాందేవ్ బాబా మరో మెగా ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే పతంజలి గ్రూప్ పేరుతో విజయవంతమైన ఆయన.. ఇప్పుడు అతిపెద్ద యోగా ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్ సమీపంలో ఉన్న కోట్ అనే గ్రామంలో వెయ్యి ఎకరాల్లో ఈ యోగా ఇన్‌స్టిట్యూట్ నెలకొల్పబోతున్నట్లు సమాచారం. దీనిపై రామ్‌దేవ్ బాబా ప్రతినిధిని ప్రశ్నించగా.. అంత తొందరెందుకు, ఆయనే దీనిపై ప్రకటన చేస్తారని చెప్పారు. మంగళవారం యోగా డే సందర్భంగా ఫరీదాబాద్‌లో లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంతో ఏడు ప్రపంచ రికార్డులను సృష్టించబోతున్నామని నిర్వాహకులు తమ ఆహ్వానంలో వెల్లడించారు.
యోగా ఇన్‌స్టిట్యూట్‌పై గతంలోనే రాందేవ్ బాబా తన మనసులో మాట బయటపెట్టారు. హర్యానాలో జరిగిన ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ 5 వేల కోట్లతో ఓ భారీ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు అప్పట్లో ఆయన చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com