వారెవ్వా.! సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన నిఖిల్.!
- October 07, 2024
‘కార్తికేయ’ సినిమాలతో పాటూ ఆ తర్వాత ‘18 పేజెస్’ వంటి సూపర్ హిట్స్‌తో దూకుడు మీదున్న నిఖిల్ సిద్దార్ధ్ ప్రస్తుతం ‘స్వయంభూ’ అనే పీరియాడిక్ మూవీతో బిజీగా వున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసం డిఫరెంట్ మేకోవర్‌లోకి మారిపోయాడు నిఖిల్. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నిఖిల్‌కి సంబంధించిన అప్డేట్ అంటే ఇదే ఇంతవరకూ. కానీ, లేటెస్ట్‌గా మరో అప్డేట్ నిఖిల్ ప్యాన్స్‌కి సర్‌ప్రైజ్ చేసింది. అదే ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’.
ఇదేంటనుకుంటున్నారా.? నిఖిల్ నుంచి రాబోతున్న కొత్త చిత్రం టైటిల్. అవునండీ నిజమే.! ‘స్వయంభూ’ సినిమా కన్నా ముందే నిఖిల్ ఈ సినిమాని పూర్తి చేసేశాడు. ఈ సినిమాలో దిశ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమా వెరీ లేటెస్ట్‌గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ విషయాన్ని తాజాగా మేకర్లు ప్రకటించారు. దీపావళికి ఈ సినిమా రిలీజ్ కానుందని తాజా అనౌన్స్‌మెంట్.
అయితే, ఈ సినిమా ఎప్పుడు పూర్తి చేశాడబ్బా నిఖిల్ అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే, ‘కార్తికేయ 2’ టైమ్‌లోనే ఈ సినిమా పూర్తయిపోయిందట. కానీ, సినిమాకి సంబంధించి ఇన్నాళ్లలో ఎప్పుడూ ఎలాంటి అప్డేట్ రాకపోవడం ఒకింత ఆశ్చర్యమే. ఏది ఏమైతేనేం, సినిమా రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయ్యిందిగా.! ఫ్యాన్స్ హ్యాపీ హ్యాపీ.!
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







