‘బిగ్’ హౌస్‌లో ఇక నుంచి రచ్చ రచ్చే.!
- October 07, 2024
చాలా చప్పగా స్టార్ట్ అయిన బిగ్‌బాస్ తెలుగు 8 వ సీజన్‌ని సడెన్‌గా కలర్ ఫుల్‌గా భారీ ఎంటర్‌టైనర్‌గా మార్చేశారు.
ఐదు వారాల ఎలిమినేషన్ల తర్వాత హౌస్‌ని సరికొత్తగా రూపొందించబోతున్నారు. పాత కంటెస్టెంట్స్‌లో అల్టిమేట్ ఎంటర్‌టైనర్స్‌ని ఏరి కోరి ఎంచి హౌస్‌లోకి పంపించారు.
ఇంకేముంది.! ఇక రేపటి నుంచి రచ్చ రచ్చే. ఆల్రెడీ బిగ్‌బాస్ హౌస్‌కి సుపరిచితులైన పాత కంటెస్టెంట్లు అవినాష్, రోహిణి, టేస్టీ తేజ, నయనీ పావనీ, డాక్టర్ గౌతమ్, హరితేజ, డాన్సింగ్ సెన్సేషన్ మెహబూబ్, యూ ట్యూబ్ సెన్సేషన్ గంగవ్వ ఇలా ఎనిమిది మంది ఎక్స్‌ట్రా కంటెస్టెంట్లను ప్రవేశ పెట్టారు.
ఆల్రెడీ తాజాగా నైనిక ఎలిమినేషన్‌తో ఎనిమిది మంది కరెంట్ కంటెస్టెంట్లు.. మరో ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన పాత కంటెస్టెంట్లతో ఇకపై హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ రూపు మారిపోనుంది.
ఈ తాజా పరిణామంతో బిగ్‌బాస్ ప్రేక్షకులు హమ్యయ్యా మళ్లీ బిగ్‌బాస్‌కి ఊపిరొచ్చింది.. అంటూ వాళ్లు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్, రాయల్ ఛాలెంజర్స్ అనే టీమ్స్‌తో బిగ్‌బాస్ వీరిని సంబోధిస్తూ వీరితో ఇకపై హౌస్‌లో చేయించబోయే రచ్చ ఎలా వుండబోతోందో లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- జ్లీబ్ అల్-షుయూఖ్‌లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!
- హిట్-అండ్-రన్ ప్రమాదం..చిన్నారి మృతి, డ్రైవర్ అరెస్ట్..!!
- ప్రయాణికుడి డబ్బు దుర్వినియోగం..ఇద్దరికి శిక్ష..!!
- వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు
- నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..







