న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‌లో భారత్‌కు అమెరికా మద్దతు
- June 21, 2016
న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్(ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌కు సభ్యత్వంపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా.. అమెరికా మాత్రం తన మద్దతును కొనసాగిస్తోంది. త్వరలో సియోల్‌లో జరగనున్న ఎన్‌ఎస్‌జీ సమావేశంలో భారత సభ్యత్వానికి సంబంధించిన బిడ్‌కు మద్దతు తెలపాలని అమెరికా ఎన్‌ఎస్‌జీ సభ్యదేశాలను కూడా కోరింది. 'భారత్‌కు మద్దతునివ్వాలన్నది అమెరికా పాలసీ.. భారత్ ఎన్‌ఎస్‌జీలో స్థానానికి సిద్ధంగా ఉంది. మేము ఎన్‌ఎస్‌జీ ప్లీనరీలో భారత దరఖాస్తుకు మద్దతునిస్తాము' అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జోస్ ఎర్నెస్ట్ తెలిపారు. అదే సమయంలో దీనిలో పాల్గొనే ప్రభుత్వాలు కూడా ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందని, అందుకు భారత్ తరపున అమెరికా వకాల్తా తీసుకొంటుందని ఆయన చెప్పారు.
సోమవారం నుంచి ఐదురోజుల పాటు దక్షిణ కొరియాలో జరిగే ఈ కార్యక్రమంలో దాదాపు 48 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







