అల్ అయిన్‌లో 110 కిలోల హాషిష్ పట్టివేత
- June 21, 2016
అబుదాబీ పోలీసులు 110 కిలోల హాషిస్ని స్వాధీనం చేసుకున్నారు. అల్ అయిన్‌లో ఈ హాషిన్ పోలీసులకు చిక్కింది. పక్కా సమాచారంతో అబుదాబీ పోలీసులు ఈ రాకెట్‌ని భగ్నం చేయగలిగారు. అత్యంత సీక్రెట్‌గా ఈ ఆపరేషన్ జరిగింది. ఇద్దరు అనుమానితుల్ని రహస్యంగా ఫాలో అయిన పోలీస్ అధికారులు, రెడ్ హ్యాండెడ్‌గా పెద్ద మొత్తంలో హాషిస్ని, రాకెట్ నిర్వాహకుల్ని అరెస్ట్ చేశారు. కారు ఫ్యూయల్ ట్యాంక్‌లో నింపిన హాషిస్ డ్రగ్స్‌ని ఇసుకలో పాతి పెడుతుండగా పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. యువతకు డ్రగ్స్ సరఫరా చేయడం ద్వారా సమాజంలో అల్లకల్లోలం సృష్టించేందుకు కొందరు ప్రయతినస్తున్నారనీ, ఇలాంటి చర్యల్ని సహించబోమని అబుదాబీ పోలీస్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మక్తౌమ్ అల్ షరిఫి చెప్పారు. డ్రగ్స్‌తో జీవితాలు నాశనమైపోతాయనీ, ఈ విషయమై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనీ ఎవరికైనా డ్రగ్స్‌కి సంబంధించి చిన్న సమాచారం అందినా, పోలీసులకు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







