నాని అస్సలు తగ్గేదే లేదుగా.!

- October 09, 2024 , by Maagulf
నాని అస్సలు తగ్గేదే లేదుగా.!

వరుస సినిమాలు, వరుస సూపర్ హిట్లు.. ఇలా అత్యంత బిజీయెస్ట్ హీరో అయిపోయాడు నేచురల్ స్టార్ నాని. వెరీ రీసెంట్‌గా సరిపోదా శనివారం’ సినిమాతో సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్నాడు నాని.
అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించిందీ సినిమా. అంతకు ముందే ‘హాయ్ నాన్న’, ‘దసరా’ సినిమాలతో సూపర్ హిట్లు కొట్టి హ్యాట్రిక్ హిట్‌గా ‘సరిపోదా శనివారం’తో వచ్చాడు.
ఇప్పుడు మళ్లీ నాని చేతిలో మూడు ప్రాజెక్టులున్నాయ్. అందులో ‘హిట్ 3’ ఒకటి. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో చేయబోయే సినిమా ఇంకోటి.
ఆల్రెడీ ‘హిట్ 3’ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో నాని ఫస్ట్ టైమ్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.
అలాగే, శ్రీకాంత్ ఓదెల సినిమా కూడా స్టార్ట్ అయ్యింది. ఇక, రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడట. సైమల్టేనియస్‌గా ఈ రెండు సినిమాల్నీ పూర్తి చేసేయనున్నాడు నాని.
అలాగే, మరో రెండు కొత్త ప్రాజెక్టులు కూడా ఓకే చేసే ఆలోచనలో వున్నాడట. ఏడాదికి ఖచ్చితంగా రెండు నుంచి మూడు సినిమాలు తన నుంచి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడట నాని.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com