నితిన్ ‘తమ్ముడు’ మంచి రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్.!
- October 09, 2024
నితిన్ నటించిన ‘తమ్ముడు’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది.కేవలం మరో 13 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ వున్నట్లు తెలుస్తోంది.
ఇక, నిర్మాణానంతర పనుల్లో బిజీ కానుంది ‘తమ్ముడు’ సినిమా. కాగా, ఈ సినిమాని రైట్ టైమ్లో రిలీజ్ చేసేందుకు చూస్తున్నారట.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని నితిన్ రేంజ్లో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందించారనీ తెలుస్తోంది. అవుట్ పుట్ బాగా వచ్చిందట.
చిత్ర యూనిట్ అంతా సినిమా అవుట్ పుట్ పట్ల సంతృప్తికరంగా వున్నారనీ తెలుస్తోంది. ఈ సినిమాలో సంయుక్తా గౌడ హీరోయిన్గా నటిస్తోంది. ‘కాంతార’ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని సైతం విశేషంగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమాలో ఓ మంచి పాత్ర దక్కినట్లు తెలుస్తోంది.
లక్కు కలిసొచ్చి సినిమా హిట్టయితే, సంయుక్తా గౌడ దశ తిరిగిపోనుందనే అంటున్నారు. అయితే, త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
తాజా వార్తలు
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!







