గోరు చిక్కుడుతో ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.?
- October 09, 2024
గోరు చిక్కుడుతో ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.?
గోరు చిక్కుడు చాలా మందికి ఇష్టముండదు. కానీ, గోరు చిక్కుడుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.
ముఖ్యంగా ఆస్తమా వున్నవారు గోరు చిక్కుడు తప్పని సరిగా తినాలని చెబుతున్నారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రాకుండా వుండేందుకు గోరు చిక్కుడు బాగా యూజ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు, దీనిలో విటమిన్ సితో పాటూ, ఫైబర్ అలాగే వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువే.అందుకే గోరు చిక్కుడు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.
ఫైబర్ కంటెంట్ అధికంగా వుండడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగుపడుతుంది. మలబద్ధకం సమస్యలు దరి చేరవ్. ఒకవేళ వున్నా ఉపశమనం వుంటుంది.
ఇక, ప్రెగ్నెంట్ లేడీస్ విషయంలో గోరు చిక్కుడు వరంలాంటిది. ప్రెగ్నెంట్ లేడీస్ ట్యాబ్లెట్ల రూపంలో ఫోలిక్ యాసిడ్ తీసుకుంటుంటారు.
కానీ, గోరుచిక్కుడులో సహజ సిద్ధంగానే పోలెట్ లభిస్తుంది. ఇది పిండం ఆరోగ్యంగా అభివృద్ధి చెందడంలో తోడ్పడుతుంది. అలాగే ఐరెన్ డెఫిషియన్సీ వున్నవారికీ కూడా గోరు చిక్కుడు మంచి ఫలితాల్నిస్తుంది.
రక్త హీనతను తగ్గించడంతో పాటూ, బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించడంలోనూ తోడ్పడుతుంది. గోరు చిక్కుడులోని ఫైటో కెమికల్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలోనూ తోడ్పడతాయ్.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







