రాబోయే రోజుల్లో బంగారం ధరలకు రెక్కలు.. $3,000కి చేరుకుంటుందా..?
- October 09, 2024
యూఏఈ: రాబోయే నెలల్లో బంగారం ధరలు పెరుగుతాయని, ఈ ఏడాది ఔన్సుకు $2,700.. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి $3,000 స్థాయిని అధిగమిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. మిడిల్ ఈస్ట్ లో రాజకీయ ఉద్రిక్తత, వడ్డీ రేట్ల తగ్గింపు, చైనా నుండి డిమాండ్, సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు, రాబోయే యుఎస్ ఎన్నికలు రాబోయే నెలల్లో బంగారం ధరలను నిర్దేశిస్తాయన్నారు. యూఏఈలో ప్రస్తుతం బంగారం ధర ఔన్సుకు స్వల్పంగా పెరిగి 2,644.34 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మధ్యప్రాచ్యంలోని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత, US ఫెడరల్ రిజర్వ్ మరింత వడ్డీ రేటు తగ్గింపు అంచనాల కారణంగా గత నెలలో ఇది ఆల్-టైమ్ గరిష్ట స్థాయి $2,670కి చేరుకుంది. “వివిధ కారణాల వల్ల బంగారం ఫ్యాషన్‌గా మారింది. కేంద్ర బ్యాంకులు డాలర్ స్థానంలో బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. బంగారంలోకి పెద్ద మొత్తంలో మూలధన ప్రవాహం ఉంది.”అని నూర్ క్యాపిటల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫిలిప్ లీల్ కామెజో అన్నారు. గోల్డ్‌మన్ సాచ్స్ బంగారం లక్ష్యాన్ని $2,700గా నిర్ణయించిందన్నారు. ఇటీవల దానిని $2,900కి పెంచింది. 2025 మొదటి త్రైమాసికంలో బంగారం 3,000 డాలర్లను తాకుతుందని నేను భావిస్తున్నట్టు అని XS.comలో సీనియర్ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ ఎలీ నాచావతి వివరించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి