ఫ్రీ హోల్డ్ ప్రాంతానికి అదనపు ప్లాట్లు
- June 21, 2016
దుబాయ్‌లోని వలసవాదుల కోసం దుబాయ్ సెంట్రల్‌లోని ఫ్రీ హోల్డ్ ఏరియాకి అదనంగా కొన్ని ప్లాట్లను ఏర్పాటు చేస్తూ కొత్త రిజల్యూషన్‌ని వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ విడుదల చేశారు. దుబాయ్ వరల్డ్ సెంట్రల్ ఏరియాలోని ప్లాట్ నెంబర్లు 205, 206 మరియు 207లపై యూఏఈ వాసులు కానివారికి ఓనర్‌షిప్ హక్కుల్ని, ఎలాంటి కాలపరిమితి లేకుండా మంజూరు చేసినట్లయ్యింది ఈ నిర్ణయంతో. 99 ఏళ్ళకు మించని లీజ్ పరమితితో ఈ ప్లాట్లకు ఓనర్‌షిప్ కలిగి ఉంటుంది. వీటికి సంబంధించిన సరిహద్దుల్ని మ్యాప్‌లో పూర్తిగా పొందు పరిచారు. దుబాయ్ ఏవియేషన్ సెక్టార్ అభివద్ధికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఏవియేషన్ సంబంధిత విభాగాల్లో దుబాయ్ డెస్టినేషన్ ఆఫ్ ఛాయిస్‌గా ఈవెంట్ ఆర్గనైజర్స్ భావించేలా ఈ నిర్ణయం దోహదపడుతుంది. అధికారిక గెజిట్‌లో పబ్లిష్ అయిన తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







