ఒలియాండర్ మొక్కల పెంపకాన్ని నిషేధం.. వాటిని ముట్టుకోవద్దని హెచ్చరిక..!!
- October 09, 2024
యూఏఈ: అబుదాబి అథారిటీ ఎమిరేట్‌లో ఒలియాండర్ ప్లాంట్ ఉత్పత్తి, సాగు, ప్రచారం, వ్యాపారంపై నిషేధం విధించారు. విషపూరిత ఒలియాండర్ మొక్కను తినడం వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అబుదాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ వెల్లడించింది. ఈ విషపూరిత మొక్కలోని ఏదైనా భాగాన్ని తినడం వల్ల కలిగే విషపూరిత ప్రమాదాల నుండి సమాజంలోని సభ్యులను, ముఖ్యంగా పిల్లలను, అలాగే పరిసర వాతావరణంలోని జంతువులను రక్షించడం ఈ చర్య లక్ష్యం అని అథారిటీ తెలిపింది. ఎమిరేట్‌లోని పౌరులు, నివాసితులు సంబంధిత అధికారులతో సహకరించాలని, ఒలియాండర్ ప్లాంట్‌ను సురక్షితంగా పారవేయాలని అథారిటీ పిలుపునిచ్చింది. తెలియని మొక్కను తాకడం లేదా తినకూడదని ప్రజలను హెచ్చరించింది. ఏదైనా తెలియని మొక్కను తినడం లేదా తాకడం వల్ల ప్రమాదం సంభవించినట్లయితే, టోల్ ఫ్రీ నంబర్ 800424ను సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!







