టూరిజం..వరదల రక్షణ కోసం శిక్షణా కోర్సులు ప్రారంభం..!!
- October 09, 2024
మస్కట్: అరబ్ టూరిజం క్యాపిటల్ 2024 కోసం ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో భాగంగా మస్కట్ యాచ్ క్లబ్ సహకారంతో హెరిటేజ్,టూరిజం మంత్రిత్వ శాఖ.. విలాయత్ ఆఫ్ సూర్‌లో ఓపెన్ వాటర్ ఫ్లడ్ రెస్క్యూలో రెండు శిక్షణా కోర్సులను నిర్వహిస్తోంది. ఇది అక్టోబర్ 10వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. పర్యాటక రంగంలో స్థానిక కమ్యూనిటీని, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి వివిధ రంగాలలోని పర్యాటక సంస్థల్లోని కార్మికులకు సాధికారత కల్పించడానికి ఉద్దేశించిన కార్యక్రమంలో ఇది భాగమని పేర్కొన్నారు. రెండు శిక్షణా కోర్సుల కోసం స్థానిక కమ్యూనిటీ నుండి 20 మందిని ఎంపిక చేసి వాడి షాబ్‌లో రెస్క్యూ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నారు. రెండవ శిక్షణా కోర్సు ఓపెన్ వాటర్‌లో రెస్క్యూ స్కిల్స్‌పై ఉంటుందని, ఓపెన్ వాటర్ నైపుణ్యాలపై సుర్‌లోని ఖోర్ అల్ బతాహ్‌లో జరుగుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







