ఫుజైరాలో కొత్త ఎతిహాద్ రైలు ప్యాసింజర్ రైలు స్టేషన్..!!
- October 09, 2024
యూఏఈ: ఎతిహాద్ రైలు కొత్త ప్యాసింజర్ స్టేషన్ ఫుజైరాకు రానుంది. ఈ మేరకు అబుదాబిలో ప్రారంభమైన మొట్టమొదటి గ్లోబల్ రైల్ సదస్సులో ఓ ఉన్నతాధికారి ప్రకటించారు. "మేము 11 నగరాలు ప్రాంతాలను కలుపుతున్నాము" అని ఎతిహాద్ రైల్‌లో పబ్లిక్ పాలసీ అండ్ సస్టైనబిలిటీ డైరెక్టర్ అధ్రా అల్మన్సూరి అన్నారు. “మేము ఇప్పటికే రెండు ప్యాసింజర్ స్టేషన్‌లను ప్రకటించాము. మొదటిది ఫుజైరాలోని సకంకంలో, రెండవది షార్జా యూనివర్శిటీ సిటీలో వస్తుందన్నారు. తమ ప్యాసింజర్ రైళ్ల గరిష్ట వేగం గంటకు 200కిమీ ఉంటుందని, 2030 నాటికి 36 మిలియన్ల మంది ప్రయాణీకులను రవాణా చేయాలని తాము ఆశిస్తున్నామని తెలిపారు. 900 కి.మీ పొడవున్న ఎతిహాద్ రైలు, మొత్తం ఏడు ఎమిరేట్స్ 11 ప్రధాన నగరాలను ఘువైఫాత్ నుండి ఫుజైరా వరకు కలుపుతుంది. హఫీత్ రైల్ అనే కంపెనీని స్థాపించామని.. ఇది ముబాదాలా, ఒమన్ రైల్, ఎతిహాద్ రైల్ మధ్య జాయింట్ వెంచర్ అని అల్మన్సూరి వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







