అల్ వక్రా పబ్లిక్ పార్క్.. 90% పనులు పూర్తి..!!
- October 09, 2024
దోహా: అల్ వక్రా పబ్లిక్ పార్క్ 90 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని, ఈ ఏడాది చివరికల్లా ప్రారంభించనున్నట్లు ఓ అధికారి తెలిపారు. అల్ వక్రా నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులలో పార్క్ భాగమని అల్ వక్రా మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఇంజినీర్ మహ్మద్ హసన్ అల్ నుయిమి చెప్పారు. అల్ వక్రా పబ్లిక్ పార్క్‌లో జాగింగ్ ట్రాక్‌లు, పిల్లల ఆట స్థలాలు, ఫిట్‌నెస్ పరికరాలు, వినోద ప్రదేశాలతో సహా అనేక సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. రోడ్లు, స్క్వైర్లు, ప్రజా సౌకర్యాల వంటి అభివృద్ధి ప్రాజెక్టులపై చెట్ల పెంపకం, ల్యాండ్‌స్కేపింగ్ కారణంగా అల్ వక్రా నగరంలో పచ్చదనం ఇటీవల 1,300 శాతం పెరిగిందన్నారు. గత ఆరు నెలల్లో అల్ వక్రా నగరంలోని బీచ్‌లను అర మిలియన్ సందర్శకులను ఆకర్షించిందని అల్ నుయిమి చెప్పారు. అల్ వక్రా సిటీలో అల్ వక్రా పబ్లిక్ బీచ్, ఫ్యామిలీ బీచ్, సీలైన్ బీచ్ అనే మూడు బీచ్‌లు ఉన్నాయని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







