కింగ్ సల్మాన్ ఆరోగ్యం..కేబినెట్‌కు యువరాజు క్లారిటీ..!!
- October 09, 2024
రియాద్:రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ఆరోగ్యం గురించి క్రౌన్ ప్రిన్స్ ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ స్పష్టత ఇచ్చారు. రియాద్‌లో జరిగిన మంత్రి మండలి వారపు సమావేశానికి అధ్యక్షత వహించిన క్రౌన్ ప్రిన్స్.. కింగ్ సల్మాన్ ఆరోగ్యం కుదుటపడుతుందని, రాజు ఆరోగ్యం గురించి ఆందోళన అవసరం లేదని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ మేరకు సెషన్ తర్వాత మీడియా మంత్రి సల్మాన్ అల్-దోసరీ తెలిపారు. సైబర్‌స్పేస్‌లో పిల్లలను రక్షించడం, సైబర్ భద్రతలో మహిళలకు సాధికారత కల్పించడం అనే క్రౌన్ ప్రిన్స్ రెండు ప్రపంచ కార్యక్రమాల వ్యూహాత్మక లక్ష్యాలను క్యాబినెట్ ప్రశంసించింది. తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు ఈ విషయంలో చేస్తున్న ప్రయత్నాలపై మంత్రివర్గం చర్చించింది.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







