కివి పండు తింటున్నారా.? అయితే, ఆరోగ్యం మీ చేతుల్లోనే.!

- October 10, 2024 , by Maagulf
కివి పండు తింటున్నారా.? అయితే, ఆరోగ్యం మీ చేతుల్లోనే.!

కొంచెం కాస్ట్ ఎక్కువే కానీ, కివి పండుతో వచ్చే ఆరోగ్యం అంతా ఇంతా కాదు. ప్రతీ రోజూ కివి పండు తినే వారిలో గుండె జబ్బు వచ్చే అవకాశాలు తక్కువగా వుంటాయని నిపుణులు చెబుతున్నారు.
హై బీపీ వున్నవారు కివీ పండు తినడం వల్ల బీపీ కంట్రోల్‌లో వుంటుంది. కొన్ని సార్లు బిపీ పూర్తిగా నయమయ్యే అవకాశాలు కూడా వున్నాయని చెబుతున్నారు.
తద్వారా గుండె పోటు సమస్యలు తక్కువవుతాయని అంటున్నారు. అంతేకాదు, కివి పండులో రోగనిరోధక శక్తిని పెంచే గుణం చాలా ఎక్కువ.
జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటూ, కడుపులో అల్సర్లను తగ్గించే శక్తి కూడా కివి పండుకుంది.
కివి పండు తింటే చర్మం నాజూగ్గా.. సున్నితంగా మారుతుంది. దాంతో, వృద్ధాప్యం కారణంగా వచ్చే ముడతలు, యవ్వనంలో వచ్చే మొటిమల సమస్య వుండదు. చర్మం కాంతివంతంగా మారుతుంది.
సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా అందుబాటులో వుండే కివి పండ్లను డయాబెటిస్ వున్నవాళ్లు కూడా నిరభ్యంతరంగా తినొచ్చు. వీటికి రక్తంలోని చక్కెర స్థాయుల్ని అదుపు చేసే గుణం పుష్కలంగా వుంది.
అంతేకాదు, రకరకాల వైరల్ జ్వరాల కారణంగా వచ్చే ఒళ్లు నొప్పులు, వయసుతో పాటూ వచ్చే కీళ్లు మోకాలి నొప్పులకు కూడా కివి పండు మంచి ఔషధంగా పని చేస్తుంది.
రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ వద్దకి వెళ్లే అవసరం వుండదని అంటారుగా.! ఆ నానుడి కివి పండుకీ వర్తిస్తుందన్నమాట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com