చికెన్ అనార్కలి
- June 21, 2016
కావలసినవి: చికెన్ లెగ్స్ 8, పెరుగు 200 గ్రా, గరం మసాలా 10 గ్రా, కర్బూజా గింజలు 100 గ్రా, జీడిపప్పు పలుకులు 100గ్రా, బాదం 30గ్రా, గసగసాలు 30గ్రా, చిలోంజి పప్పు 30గ్రా, మీగడ 50గ్రా, దానిమ్మ రసం 200గ్రా, దానిమ్మ పండు 1, పచ్చ యాలుకల పొడి 1టీ స్పూన్, తెల్ల మిరియాల పొడి 1టీ స్పూన్, పచ్చి మిరపకాయల ముద్ద 1 టేబుల్ స్పూన్, నూనె 50 మిలీ.
ఎలా చేయాలి
చికె న్‌కి ఉప్పు, కొద్దిగా నూనె పట్టించి పక్కన పెట్టండి. జీడిపప్పు, గసగసాలు, బాదం, కర్బూజా గింజలను ఉడికించి నీటిని వంచేసి మెత్తగా రుబ్బండి. మందపాటి మూకుడులో నూనెను వేడి చేసి దానిలో గరం మసాలా వేయండి. పప్పుల ముద్దను చిలకరించిన పెరుగులో కలిపి మూకుడులో వేయండి. సన్నటి సెగ మీద నూనె పైకి తేలే వరకు ఉడికించండి. ఉప్పు, తెల్లమిరియాల పొడి, పచ్చి మిరపకాయల ముద్దను ఈ మిశ్రమంలో వేసి కలియబెట్టండి. యాలకల పొడి, దానిమ్మరసం కూడా కలిపి, ఆ తర్వాత చికెన్ లెగ్స్‌ను వేయండి. సన్నటి సెగ మీద చికెన్ ఉడికే వరకు మగ్గనివ్వండి. చివరలో మీగడ కలిపి కింద కి దించండి. మీగడ, దానిమ్మ గింజలు వేసి వేడిగా వడ్డించండి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







