ఫార్మ్ పై రైడ్.. 12 మిలియన్ దిర్హామ్ విలువైన పొగాకు సీజ్..!!

- October 11, 2024 , by Maagulf
ఫార్మ్ పై రైడ్.. 12 మిలియన్ దిర్హామ్ విలువైన పొగాకు సీజ్..!!

యూఏఈ: రస్ అల్ ఖైమాలోని ఒక వ్యవసాయ క్షేత్రంపై అధికారులు రైడ్ చేశారు.  అక్కడ నిల్వచేసిన సుమారు 7,195 కిలోల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.  దీని మార్కెట్ విలువ Dh12 మిలియన్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA) సహకారంతో రస్ అల్ ఖైమాలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ (DED) అక్రమ వస్తువులను స్వాధీనం చేసుకుందని వెల్లడించారు.  నేరస్థులపై చట్టపరమైన చర్యల కోసం న్యాయ అధికారులకు రిఫర్ చేసినట్టు తెలిపారు. దీంతోపాటు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిర్వహించే వ్యక్తులందరికీ DED జరిమానాలు విధించింది. విచారణలో, సంబంధిత అధికారుల నుండి అవసరమైన లైసెన్స్‌లు లేకుండా కొన్ని నెలలుగా అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ కార్మికులు అంగీకరించారని RAK DEDలోని కమర్షియల్ కంట్రోల్ అండ్ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ ఫైసల్ అల్యూన్ తెలిపారు. వినియోగదారులను రక్షించేందుకు వాణిజ్య నియంత్రణ బృందం ఏడాది పొడవునా తన తనిఖీలను కొనసాగిస్తుందని ఆయన వివరించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com