మస్కట్‌లో స్మార్ట్ పార్కింగ్ ప్రాజెక్ట్ ప్రారంభం..!!
- October 11, 2024
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో అల్ ఖువైర్, అల్ ఘుబ్రా ప్రాంతాల్లోని పెయిడ్ పబ్లిక్ పార్కింగ్ ఏరియాలలో వెహికల్ ఇమేజింగ్ సెన్సార్లను ఆపరేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. “ప్రైవేట్ సెక్టార్, మస్కట్ మునిసిపాలిటీ భాగస్వామ్యంతో స్మార్ట్ సిస్టమ్‌లను అప్‌గ్రేడ్ చేయడానికి మస్కట్ మునిసిపాలిటీ చేస్తున్న ప్రయత్నాలలో వాహన ఇమేజింగ్ సర్వీస్‌తో కూడిన సెన్సార్లు భాగం. అక్టోబర్ 13 నుండి ప్రారంభమయ్యే అల్ ఖువైర్,అల్ ఘుబ్రా ప్రాంతాలలో రుసుములకు లోబడి పబ్లిక్ పార్కింగ్ స్థలాలలో వాహన ఇమేజింగ్ సేవతో కూడిన సెన్సార్లు పనిచేస్తాయి.’’ అని మునిసిపాలిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలకు పార్కింగ్ రిజర్వేషన్ మెకానిజం గురించి 90091కి SMS ద్వారా మస్కట్ మునిసిపాలిటీ తెలియజేయనుంది. మస్కట్ మునిసిపాలిటీ వెబ్సైట్న ద్వారా ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు పార్కింగ్ పర్మిట్లను అందించనుంది. ఈ మేరకు ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







