ఇస్రో శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు
- June 21, 2016
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సి-34 విజయవంతం కావటంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు తెలిపారు. ''20 ఉప గ్రహాలు నింగిలోకి దూసుకెళ్లాయి. ఇస్రో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉప గ్రహాలు రూపొందించడంలో పుణె, చెన్నైకు చెందిన విద్యార్థులు కీలక పాత్ర పోషించడం అభినందనీయం. శాస్త్రవిజ్ఞానంలో యువత ఆసక్తి చూపడం ఆనందంగా ఉంది'' అని ప్రధాని ట్వీట్ చేశారు.
శ్రీహరికోటలోని షార్ నుంచి బుధవారం ఉదయం చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సి-34 ప్రయోగం విజయవంతమైంది.
బారత్‌కు చెందిన కార్టోశాట్-2సి, విద్యాసంస్థలకు చెందిన రెండు ఉపగ్రహాలు, 17 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి చేరుకున్నాయి.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









