అయోవాలో ప్రారంభమైన NATS ప్రస్థానం
- October 14, 2024
అమెరికా: అమెరికాలో తెలుగుజాతి ఎక్కడ ఉంటే అక్కడ ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాన్ని ప్రారంభించి తెలుగు వారికి సేవలందిస్తుంది.ఈ క్రమంలోనే తాజాగా అయోవాలో నాట్స్ చాప్టర్ ప్రారంభించింది. అయోవా చాప్టర్ సమన్వయకర్తగా శివరామకృష్ణారావు గోపాళంకు నాట్స్ నాయకత్వం బాధ్యతలు అప్పగించింది. కృష్ణ ఆకురాతి, నవీన్ ఇంటూరి, జగదీష్ బాబు బొగ్గరపు, గిరీష్ కంచర్ల, డాక్టర్ విజయ్ గోగినేని, శ్రీని కాట్రగడ్డ తదితర సభ్యులు నాట్స్ అయోవా చాప్టర్‌ను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించనున్నారని తెలిపింది.
నాట్స్ అయోవా చాప్టర్ ప్రారంభోత్సవంలో నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టిపి రావు, జోనల్ వైస్ ప్రెసిడెంట్ హరీష్ జమ్ముల, నేషనల్ కో-ఆర్డినేటర్ ఫర్ మెంబర్షిప్ రామకృష్ణ బాలినేని తోపాటు చికాగో చాప్టర్ కోఆర్డినేటర్ వీర తక్కెళ్ళపాటి, షికాగో చాప్టర్ కమ్యూనిటీ సర్వీస్ లీడర్ అంజయ్య వేలూరు తదితరులు పాల్గొన్నారు.
మనం పూర్వ జన్మలో చేసిన కర్మఫలం వల్ల, మన తల్లిదండ్రులు చేసిన మంచి పనుల వల్ల మనం ఈరోజు ఇక్కడ ఉన్నామని, అలాగే మనం చేసే ఈ సమాజ సేవ మరుసటి తరానికి, మన పిల్లల భవిష్యత్తుకి తోడ్పడుతుందని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. అయోవా నాట్స్ జట్టు సభ్యులకు చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలు, సాధించాల్సిన లక్ష్యాలను ప్రశాంత్ పిన్నమనేని నిర్థేశించారు. తెలుగు వారి అవసరాలకు అనుగుణంగా నాట్స్ కార్యకలాపాలను విస్తృతం చేయాలని, సేవా కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి పిలుపునిచ్చారు. నాట్స్ తన కార్యక్రమాల ద్వారా ఆర్థిక సహాయంతో పాటు సమాజంలో ఉన్న అందర్నీ ఒకటి చేయడానికి పలు కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. మన సంస్కృతిని భాషని కాపాడటం తో పాటు సంఘ సేవ, సమాజ సేవ అనేది నాట్స్ లక్ష్యాల్లో భాగమని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి అన్నారు. డాక్టర్స్ హెల్ప్ లైన్ ద్వారా సెకండ్ ఒపీనియన్ ఎంతోమందికి ఉపయోగపడిందని, అనేక మంది డాక్టర్లు నాట్స్ హెల్ప్ లైన్ ద్వారా సేవలందిస్తున్నారు అని తెలిపారు.నాట్స్ ద్వారా కొత్త స్నేహితులను పొందటంతో పాటు వృత్తిపరంగా కూడా అభివృద్ధి సాధించడానికి వీలు పడుతుందని నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టిపి రావు అన్నారు. కొత్త జట్టు సభ్యులందరూ నాట్స్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
హరీష్ జమ్ముల అయోవా టీంని పరిచయం చేసి, వారికి తన అభినందనలు తెలిపారు.నాట్స్ కార్యక్రమాలను, మహిళా సాధికారత కార్యక్రమాలను రామకృష్ణ బాలినేని వివరించారు.నాట్స్ సంస్థలో మహిళలు, పిల్లలు చురుకుగా పాల్గొనాలని అందరినీ కోరారు. దసరా పండుగనాడు అయోవా చాప్టర్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని, అయోవా తెలుగు వారందరూ కలిసి అయోవా నాట్స్ చాప్టర్‌ని మరింత వృద్ధిలోకి తీసుకురావడానికి పాటుపడతామని శివరామకృష్ణ రావు గోపాళం హామీ ఇచ్చారు. అయోవా లో నాట్స్ తన కార్యకలాపాలను ప్రారంభించడం ఎంతో గర్వంగా ఉందని, అయోవాలో చాప్టర్‌ని ప్రారంభించిన మొట్టమొదటి తెలుగు సంస్థ నాట్స్ అని కృష్ణ ఆకురాతి తెలిపారు.గిరీష్ కంచర్ల,నవీన్ ఇంటూరి సభకు విచ్చేసిన అతిధులు అందరికీ భోజన సదుపాయాలు కల్పించారు.
జగదీష్ బాబు బొగ్గరపు, డాక్టర్ విజయ్ గోగినేని, నవీన్ ఇంటూరి, శ్రీని కాట్రగడ్డ, గిరీష్ కంచర్ల మొదలైన వారు నాట్స్ లో భాగస్వామ్యం కల్పించినందుకు జాతీయ కార్యవర్గానికి తమ కృతజ్ఞతలు తెలిపారు.చాప్టర్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహాయ సహకారాలు అందించిన సమన్విత వర్మ, శ్రీనిధి కొంపెల్ల, సుమన్ ఒంటేరు, జయంత్ గద్దె, సురేష్ కావుల, డాక్టర్ సుందర్ మునగాల తోపాటు అయోవా తెలుగువారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి