ISRO కు ప్రతిష్టాత్మక ఐఏఎఫ్ అవార్డు
- October 14, 2024
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో)కు ప్రతిష్ఠాత్మకమైన ఐఏఎఫ్ అవార్డు దక్కింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి చంద్రయాన్- 3 రాకెట్ ప్రయోగించి ఘన విజయం సాధించి అగ్రదేశాల సరసన భారత దేశాన్ని నిలిపినందుకు ఐఏఎఫ్ సంస్థ ప్రతిష్టాత్మక అవార్డును ఇస్రోకు అందజేశారు.
ఈ ఏడాది ఈ అవార్డు కార్యక్రమాన్ని ఐఏసి-2024 ఇటలీలోని మిలన్ నగరం నందు నిర్వహించారు.ఈ అవార్డును ఇస్రో తరపున చైర్మన్ డాక్టర్ సోమనాథ్ అందుకున్నారు.
శాస్త్రవేత్తలు, ఉద్యోగుల సహకారంతో చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టడం జరిగిందన్నారు.ఈ అవార్డును అందుకున్నందుకు ఇస్రో శాస్త్రవేత్తలు, ఇస్రో ఉద్యోగస్తులకు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాధ్ అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







