ఒమన్ లో బెలారసియన్ పీఎం.. నేషనల్ మ్యూజియం సందర్శన..!!
- October 15, 2024
మస్కట్: రిపబ్లిక్ ఆఫ్ బెలారస్ ప్రధాన మంత్రి రోమన్ గోలోవ్చెంకో ఒమన్ సుల్తానేట్‌లో తన అధికారిక పర్యటనలో భాగంగా నేషనల్ మ్యూజియాన్ని సందర్శించారు.ఆయన వెంట ప్రతినిధి బృందం ఉంది. ఒమన్ సుల్తానేట్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించే విషయాల గురించి అధికారులు వివరించారు. మారిటైమ్ హిస్టరీ హాల్లో ఒమానీ నౌకాదళం గురించిన వివరాలను, వాస్కోడగామా ఓడ శిధిలాల నుండి సేకరించిన భాగాలను పరిశీలించారు. సివిలైజేషన్ అచీవ్మెంట్స్ హాల్, అఫ్లాజ్ హాల్, "గ్రేట్‌నెస్ ఆఫ్ ఇస్లాం" హాల్‌లను కూడా సందర్శించారు. "ది డియరెస్ట్ అండ్ ఫైనెస్ట్ ఆఫ్ మెన్" అనే పెవిలియన్‌ను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పెవిలియన్ దివంగత సుల్తాన్ ఖబూస్ బిన్ సైద్ బిన్ తైమూర్‌కు సంబంధించిన వస్తువులను పెట్టారు. అనంతరం బెలారసియన్ ప్రధాని రాయల్ ఒపెరా హౌస్ మస్కట్ (ROHM)ని సందర్శించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో 11 ఎక్స్ఛేంజ్ కంపెనీలపై తాత్కాలిక సస్పెన్షన్..!!
- గల్ఫ్‌లో సైబర్ దాడులు.. యూఏఈ, సౌదీ అరేబియాపైనే 50 శాతం..!!
- ఫిషింగ్, ఫేక్ మెసేజులపై ఖతార్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్నింగ్..!!
- ఒమన్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. వాహనదారులకు కీలక హెచ్చరిక..!!
- AI వినియోగంపై అరబ్ దేశాలకు కీలక సూచనలు..!!
- సౌదీ నేషనల్ డే వేడుకలు.. జెడ్డా నుంచి అల్ ఖోబర్ వరకు వైమానిక విన్యాసాలు..!!
- సౌదీ అరేబియాకు యుద్ధ విమానాల విక్రయానికి అమెరికా ఆమోదం
- దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
- అక్టోబర్ 7న తిరిగి తెరుచుకోనున్న దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్
- కువైట్‌లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!







