బుర్జ్ ఖలీఫా న్యూఇయర్ వేడుకలు..150శాతం పెరిగిన టిక్కెట్ల ధరలు..!!

- October 15, 2024 , by Maagulf
బుర్జ్ ఖలీఫా న్యూఇయర్ వేడుకలు..150శాతం పెరిగిన టిక్కెట్ల ధరలు..!!

దుబాయ్: బుర్జ్ ఖలీఫాలో న్యూఇయర్ వేడుకలు చూసేందుకు టిక్కెట్ల ధరలను ప్రకటించారు. పెద్దలకు Dh580,  5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు Dh370గా నిర్ణయించారు. టిక్కెట్‌లు అక్టోబర్ 24 నుండి అందుబాటులో ఉంటాయి. టిక్కెట్‌ ధరలో ఫుడ్, డ్రింక్స్ వోచర్ ఉంటుంది. నిర్వాహకులు గత సంవత్సరం మొదటిసారిగా బుర్జ్ ఖలీఫా వద్ద న్యూఇయర్ వేడుకల ఎంట్రీకి టిక్కెట్లను ప్రవేశపెట్టారు. పెద్దలకు 300 దిర్హామ్‌లు, పిల్లలకు 150 దిర్హామ్‌లు వసూలు చేశారు.  అయితే, డౌన్‌టౌన్ దుబాయ్‌లోని ఇతర ప్రాంతాలలో ఉచితంగా న్యూఇయర్ వేడుకలను వీక్షించవచ్చని ఎమ్మార్ ప్రకటించింది.  డిసెంబర్ 31 మధ్యాహ్నం 3.30 గంటల నుండి వేడుకలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com