ఒమన్‌లో భారీ వర్షాలు.. పలువురిని రక్షించిన అధికారులు..!!

- October 16, 2024 , by Maagulf
ఒమన్‌లో భారీ వర్షాలు.. పలువురిని రక్షించిన అధికారులు..!!

మస్కట్: అల్పపీడనం కారణంగా ఒమన్ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు వ్యక్తులను అధికారులు రెస్క్యూ చేశారు. సూర్‌లో వేర్వేరు సంఘటనలలో వరదలో చిక్కుకున్న నలుగురు సభ్యుల కుటుంబాన్ని అధికారులు రక్షించారు. మరో సంఘటనలో, వరద నీటిలో వాహనం కొట్టుకుపోయిన ఘటనలో డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని అల్ సలీమియా వాడిలో వాహనం చిక్కుకుపోయిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ రక్షించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాయల్ ఒమన్ పోలీసులు కోరారు.

ఉత్తర, దక్షిణ అల్ షర్కియా, మస్కట్‌లలో వర్షపాతం మొత్తం 40 నుండి 90 మి.మీ వరకు ఉంటుందని సిఎఎలోని ఫోర్‌కాస్టింగ్ విభాగం అధిపతి మహమూద్ బిన్ రషీద్ అల్ ఖయారీ వివరించారు. అల్ వుస్తా 20 మరియు 50 మిమీ, అల్ బురైమి,ధోఫర్‌లలో 10 నుండి 30 మి.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.        

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com