2026 నాటికి 4 మిలియన్లకు దుబాయ్ జనాభా..!!

- October 17, 2024 , by Maagulf
2026 నాటికి 4 మిలియన్లకు దుబాయ్ జనాభా..!!

యూఏఈ: మెరుగైన ఉద్యోగావకాశాల కోసం ఎమిరేట్‌కు తరలివస్తున్న ప్రవాసులు, పెట్టుబడిదారుల ప్రవాహంతో 2026 నాటికి దుబాయ్ జనాభా 4 మిలియన్లకు చేరుకుంటుందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్&పి తెలిపింది. "మేము 2024లో ఎమిరేట్ తలసరి GDPని సుమారు $38,000 (Dh139,460)గా అంచనా వేస్తున్నాము. యూఏఈలోని ఇతర ప్రాంతాలలో నివసించే, పని కోసం దుబాయ్‌కి వెళ్లే వారిని మినహాయించి  2023 సంవత్సరాంతానికి 3.7 మిలియన్లకు జనాభా చేరుకుంది. 2026 నాటికి ఇది 4.0 మిలియన్లకు చేరుకుంటుందని మేము అంచనా వేస్తున్నాము." అని తమ నివేదికలో S&P విశ్లేషకులు తెలిపారు.  

దుబాయ్ జనాభా ఈ సంవత్సరంలో 134,000 పైగా పెరిగింది. అక్టోబర్ 16 నాటికి 3.789 మిలియన్లకు చేరుకుంది. జనవరి 2021 నుండి, నగర జనాభా 378,000 పైగా పెరిగింది. ప్రధానంగా విదేశీ నిపుణులు, కార్మికులు, పెట్టుబడిదారుల ప్రవాహం కారణంగా ఇది సాధ్యమైందని నిపుణులు తెలిపారు. ప్రపంచంలోని టాప్ 50 నగరాల్లో దుబాయ్ 15వ స్థానంలో ఉంది. హెన్లీ నివేదిక ప్రకారం 72,500 మంది మిలియనీర్లు ఉన్నారు. 2023లో 3.3 శాతం వృద్ధిని అనుసరించి 2024-2027లో వాస్తవ GDP వృద్ధి సగటున 3 శాతానికి చేరువలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com