UAEలో AED 300 చేరుకున్న 22K గోల్డ్ గ్రాము ధర...
- October 17, 2024
యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర తొలిసారిగా 300aed (UAE DIRHAM)చేరుకుంది. భారత కరెన్సీలో (1aed = 22.88rs) 6866.68/- రూపాయలతో సమానం.గత 10 రోజులుగా బంగారం ధర గ్రాముకు 292.50 దిర్హామ్ నుండి ఈ ఉదయం 300.25 చేరుకుంది. అయితే గతంలో బంగారం ధర పెరుగుదల విషయంలో దుబాయ్/యూఏఈలో 22కే బంగారం ధర గ్రాముకు 300 కు చేరుకుంటుందని ఏడాది క్రితమే చెబితే ఎవరూ నమ్మేవారు కాదు అని మలబార్ గోల్డ్ & డైమండ్స్ వైస్ చైర్మన్ అబ్దుల్ సలామ్ కేపీ అన్నారు. ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ ధర పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి.మొదటిగా, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం ప్రధాన కారణం. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా డాలర్ బలహీనత, బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అమెరికా డాలర్ బలహీనపడినప్పుడు, బంగారం ధరలు పెరుగుతాయి, ఎందుకంటే బంగారం డాలర్లలో కొలవబడుతుంది.
ఇంకా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అనిశ్చితి కూడా బంగారం ధరలను పెంచుతుంది. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు, ఆర్థిక సంక్షోభాలు, మరియు రాజకీయ అస్థిరతలు ముదుపర్లను సురక్షితమైన పెట్టుబడుల వైపు మళ్లిస్తాయి. బంగారం ఒక సురక్షిత పెట్టుబడిగా భావించబడుతుంది, అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో దాని డిమాండ్ పెరుగుతుంది.
భవిష్యత్తులో బంగారం ధర పెరుగుతుందా తగ్గే అవకాశం ఉందా అంటే ఈ పెరుగుదల అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువ, మరియు అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఇవన్నీ బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతానికైతే బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా అనేది చెప్పడం కష్టం, కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
- బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
- ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!







