పాఠశాల పై వైమానిక దాడి..28 మంది దుర్మరణం!
- October 17, 2024
గాజా: గాజా వర్సెస్ ఇజ్రాయిల్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.ఈ రెండు ప్రాంతాల మధ్య గొడవల కారణంగా సామాన్య ప్రజలు చాలా మంది మరణించారు.అయితే తాజాగా ఇజ్రాయిల్ చేసిన పనికి.. గాజాకు చెందిన 28 మంది దుర్మరణం చెందారు.ఈ సంఘటన గురువారం రోజున రాత్రి ఈ చోటు చేసుకుంది.
ఉత్తర గాజాలో ఉన్న ఓ పాఠశాల భవనంపై...ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది.ఈ ఘటనలో ఏకంగా 15 మంది మరణించినట్లు ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది.ఇందులో ఐదుగురు చిన్నారులు ఉన్నారట.ఇక ఈ సంఘటనలో.. మరో 10 నుంచి 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు.వారిని ఆసుపత్రికి తరలించారు.ఇక గాజాలోని... హుస్సేని అనే స్కూల్ వద్ద కూడా కాల్పులు జరిపారు ఇజ్రాయిల్ మూకలు.ఈ సంఘటనలో దాదాపు 20 మందికి గాయాలు అయ్యాయట.దీంతో గాజా వణికిపోతోంది.
--సాయికిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







