AI-కెమెరాలు యాక్టివ్..6 నెలల్లో 1.5 మిలియన్ల నోటీసులు జారీ..!!
- October 18, 2024
కువైట్: కువైట్ రోడ్లలో వేగంగా వెళ్లడం, ఫోన్ వాడకం అత్యంత సాధారణ ఉల్లంఘనలుగా మారాయి.వీటికి అరికట్టేందుకు అనేక చర్యలు చేపడుతున్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) కఠినమైన ట్రాఫిక్ చట్టాలను అమలు చేస్తుంది. జనవరి 1 నుండి జూన్ 30 మధ్య కువైట్‌లోని ఆరు గవర్నరేట్లలో 9,472 నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఉల్లంఘనలతో 1.5 మిలియన్ల ఓవర్ స్పీడ్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఈ కాలంలో జరిగిన ట్రాఫిక్ ప్రమాదాలలో 93 శాతానికి పైగా రాక్ లెస్ డ్రైవింగ్ చేయడం వల్ల కాగా, 7 శాతం ఇతర కారణాల వల్ల జరిగాయని ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ ఫహాద్ అల్-ఇస్సా తెలిపారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులు 30వేలకుపైగా నమోదయ్యాయి. డ్రైవింగ్‌లో సీట్‌బెల్ట్ వినియోగ ఫోన్ వినియోగాన్ని పర్యవేక్షించడానికి 252 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కెమెరాలను ఏర్పాటు చేశారు. కొత్త AI కెమెరాలు ఉల్లంఘనలను సమర్థవంతంగా గుర్తిస్తున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







