మహేష్ బాబు - రాజమౌళి కొబ్బరి కాయ కొట్టేదెప్పుడంటే.!

- October 19, 2024 , by Maagulf
మహేష్ బాబు - రాజమౌళి కొబ్బరి కాయ కొట్టేదెప్పుడంటే.!

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రాజమౌళి తీయబోయే సినిమా ఏ రేంజ్‌లో వుండాలి.? అనేది ఓ ఐడియా వుండనే వుంటుంది. అయితే, ఆ రేంజ్ మూవీ కోసం ఆల్రెడీ రాజమౌళి రంగం సిద్ధం చేసేశారు కూడా.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ఆ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా రూపొందనుందనీ ఆల్రెడీ హింట్ ఇచ్చారు కూడా రాజమౌళి.

అయితే, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందీ.? అసలు ప్రీ ప్రొడక్షన్ పనులు ఎంతవరకూ వచ్చాయ్.? అన్న అంశంపై క్లారిటీ లేదింతవరకూ.

తాజాగా అందుతోన్న ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం ప్రకారం ఈ సినిమాని డిశంబర్‌లో పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారనీ తెలుస్తోంది.

అంతేకాదు, ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కోసం జర్మనీలోని కొన్ని స్పాట్స్ పరిశీలించి వచ్చారట జక్కన్న. అడ్వెంచర్స్, అదిరిపోయే యాక్సన్ ఎపిసోడ్స్.. ఇలా ఈ సినిమాలో చాలా చాలా ప్రత్యేకతలున్నాయనీ తెలుస్తోంది.

అంతేకాదు, ఈ సినిమా కోసం మహేష్ బాబు ఓ డిఫరెంట్ మేకోవర్‌‌లో కనిపించనున్నారన్న సంగతి ప్రస్తుతం ఆయన గెటప్ చూస్తుంటేనే అర్ధమవుతోంది. ఖచ్చితంగా మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో ఈ ప్రాజెక్ట్ మరో విజువల్ ఫీస్ట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com