మరోసారి బాలయ్య అన్స్టాపబుల్కి సీఎం చంద్రబాబు
- October 19, 2024
ఆహా ఓటీటీలో వచ్చిన బాలకృష్ణ అన్స్టాపబుల్ మూడు సీజన్లు పూర్తిచేసుకొని ఇటీవలే నాలుగో సీజన్ ప్రకటించారు. నాలుగో సీజన్ ప్రోమో లాంచ్ చేసి గ్రాండ్ గా అనౌన్స్ చేసారు. దీంతో నాలుగో సీజన్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అలాగే అన్స్టాపబుల్ సీజన్ 4 అక్టోబర్ 24 నుంచి స్ట్రీమ్ కానున్నట్టు కూడా ప్రకటించారు. తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
ఆహా అన్స్టాపబుల్ నాలుగో సీజన్ లో మొదటి ఎపిసోడ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఉండబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన షూటింగ్ రేపు జరగనున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ గతంలో చంద్రబాబు నాయుడు అన్స్టాపబుల్ షోకి లోకేష్ తో కలిసి వచ్చి సందడి చేసారు. ఇప్పుడు మరోసారి సీఎం అయ్యాక వస్తుండటంతో ఈ ఎపిసోడ్ పై అంచనాలు నెలకొన్నాయి.
బాలయ్య బాబు ఈసారి సీఎం చంద్రబాబు నాయుడుని ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, చంద్రబాబుతో కలిసి బాలయ్య ఎలాంటి సరదా గేమ్స్ ఆడనున్నాడో అని బాలయ్య, టీడీపీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అన్స్టాపబుల్ సీజన్ 4 లో మొదటి ఎపిసోడ్ సీఎం చంద్రబాబుతో వస్తుండటంతో ప్రేక్షకులు ఆహాలో ఈ షో కోసం ఎదురుచూస్తున్నారు. మీరు కూడా ఈ అదిరిపోయే అన్స్టాపబుల్ విత్ NBK షోని త్వరలోనే ఆహా ఓటీటీలో చూసేయండి.
తాజా వార్తలు
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!







