చిరంజీవి - బాలయ్య ఈ కాంబో వర్కవుట్ చేసేది ఆ డైరెక్టరేనా.?
- October 19, 2024
ఈ జనరేషన్ స్టార్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీయార్ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ అనే ఓ భారీ బడ్జెట్ చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా విస్తరించేలా చేశారు.
ఇక, సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య కాంబినేషన్‌లో ఆ ముచ్చట కోసం కొందరు ఎదురు చూస్తున్నారు. అంతెందుకు మెగాస్టార్ చిరంజీవే స్వయంగా బాలయ్యతో కలిసి నటించాలనుందని తన మనసులో మాటను ఇటీవల ఓ కార్యక్రమంలో బయట పెట్టిన సంగతి తెలిసిందే.
అయితే, అందుకోసం ఓ డైరెక్టర్ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు, బోయపాటి శీను. ఈయన ప్రస్తుతం బాలకృష్ణతో ‘అఖండ 2’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా స్టార్ట్ అయ్యింది. త్వరలోనే చిరు, బాలయ్య కాంబినేషన్‌కి బోయపాటి కథ సిద్ధం చేయబోతున్నారనీ ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.
ఏమో కాలం కలిసొస్తే, బాలయ్య ‘అఖండ 2’లోనే చిరంజీవిని గెస్ట్ రోల్‌లో చూపించేసినా చూపించేస్తాడు బోయపాటి శీను. ఆ గుడ్ టైమ్ కోసం వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!
- మస్కట్ లో సునామీ పై మూడు రోజుల క్యాంపెయిన్..!!
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం







